25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మికుల ఐక్యతను చాటాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సిఐటియు జెండాలను ఎగురవేసి కార్మిక వర్గా ఐక్యతను చాటాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో శంకర్ గౌడ్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం ప్రదర్శనగా బయలుదేరుతున్న సందర్భంగా అప్పటి పాలకవర్గం కార్మికులపై కాల్పులు జరిపి అనేకమంది కార్మికుల ప్రాణాలను బలిగున్నారని వారి రక్తపు మడుగుల నుండి పుట్టినదే ఎర్రజెండా అని, ఆ కార్మికుల త్యాగ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో హక్కులను సాధించారని వారన్నారు. అలా పోరాడి సాధించుకున్న చట్టాలను నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగిందని, కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులకు యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయటం కోసం మేడే ను కార్మిక వర్గం ప్రతిజ్ఞ దినంగా నిర్వహించుకొని, ఐక్య పోరాటాలకు సంసిద్ధం కావాలని వారన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులు తమ చట్టాల పునరుద్ధరణకు మరో పోరాటానికి సిద్ధపడాలని తెలిపారు. మేడే జెండాలను ఎగురవేయడంతో పాటు, కార్మిక వర్గం ప్రతిజ్ఞను పూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియుకు చెందిన వివిధ రంగాల కార్మిక నాయకులు అంగన్ వాడీ జిల్లా కార్యదర్శి పి.స్వర్ణ, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి సుకన్య, మధ్యాహ్న భోజనం సంగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

Workers' unity must be demonstrated.

More articles

Latest article