28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ రాష్ట్ర సేన

Must read

📰 Generate e-Paper Clip

 

.   .   .  తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ని ప్రకటించిన కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా ప్రకటించారు. మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన పార్టీ పేరు ను కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించారు. దీంతో జాగృతి నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణంలోని జై తెలంగాణ, జై టిఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా కవిత తన ఇంట్లో సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం గన్ పార్క్ కు చేరుకుని అమరవీరులకు నివాళ్ళర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్ తో మునీరాబాద్ లోని సభా వేదిక వద్దకు చేరుకున్నారు. వేలాది మంది కార్యకర్తల మధ్య పసుపు నీలం ఆకుపచ్చ రంగుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సేన జండాను ఆవిష్కరించారు.

More articles

Latest article