27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యే ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకుని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఎంఆర్ కేసులపై బుధవారం సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని విపులంగా పరిశీలిస్తూ, విచారణ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సాక్ష్యాధారాల సేకరణలో నాణ్యత, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్బిఐ ఇన్స్ పెక్టర్ కే.శ్రీధర్ రెడ్డి, ఎన్ఐబి ఇన్స్ పెక్టర్ ఎం.అశోక్, సి.సి.ఆర్.బి ఇన్స్ పెక్టర్ ఆర్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article