27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ కాలేజ్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జేఈఈ ప్రవేశ పరీక్షలలో నిజామాబాద్ ఎస్ ఆర్ కాలేజ్ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారని, 178 మంది విద్యార్థులు జేఈఈ అడ్డాన్స్డ్ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత పొందారని ఎస్ ఆర్ కాలేజ్ డీజీఎం గోవర్థన్ రెడ్డి అన్నారు. జేఈఈ మెయిన్స్ లో నిట్ లలో ప్రవేశానికి ఎన్ టీ ఏ జాతీయ స్థాయిలో జనవరి, ఏప్రిల్ 2026 లో రెండు విడతలుగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు దేశం మొత్తంగా 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఏప్రిల్ 20 న విడుదల చేసిన ఫలితాలలో 16 మంది విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ఎం.శ్రీధర్ 162, ఎల్.మహేష్ 264, డి.శ్రీకాంత్ 3231, వై.శ్రీవర్ధన్ 3837, ఎస్.విశ్వాక్షయ 4032 ,ఎం.ప్రకాష్ 4945, జె.యశ్వంత్ 5505, ఎ.చరణ్ తేజ 5749, ఎం.నివాస్ రెడ్డి 6158, డి.వర్షిత్ 6274, కె.ఆకాష్ 6715, ఎం.నైతిక్ నాయక్ 7311, జి.పవన్ 7407, బి.హరిష 7857, వి.ప్రేమ దాస్ 8879, ఎన్.సంజన కుమారి 9585 లు 10,000 లోపు ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల ర్యాంకులు సాధించే విధంగా షెడ్యుల్స్ తయారు చేశామన్నారు. బేసిక్స్ తో పాటు, మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎప్ సెట్ కోచింగ్ ఇవ్వడం, సీనియర్ అధ్యాపకులతో తరగతులు, డౌట్ సెషన్స్ నిర్వహించడం, వారాంతపు పరీక్షలు మంచి మెటిరీయల్ ఇవ్వటం వల్లనే జాతీయ స్థాయి ర్యాంకులు గత 12 సంవత్సరాలుగా నిజామాబాద్ లో ఎస్ ఆర్ కాలేజీ విద్యార్థులు సాధిస్తున్నారన్నారు. అలాగే జోనల్ ఇన్ చార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ యావరేజ్ విద్యార్థులు కూడా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించే విధంగా ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డీన్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి టాపిక్ పైన విద్యార్థికి సరైన బోధన, అర్థం అయ్యే విధంగా బోధించడం, వ్యక్తిగత శ్రద్ద ప్రతి పరీక్ష తర్వాత ఎగ్జామ్ పేపర్ డిస్కషన్, ఏ లెక్చరర్ అయితే బోధన చేస్తారో ఆ లెక్చరర్ ద్వారా డౌట్ సెషన్ కండక్ట్ చేయడం ఎస్ ఆర్ కాలేజ్ స్పెషాలిటీ అన్నారు. దీని వల్లనే ర్యాంకులు సాధించడం అలవాటుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులను ఎస్ ఆర్ చైర్మన్ ఎనగందుల వరదా రెడ్డి, డైరక్టర్స్ సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రిన్సిపాల్స్ హన్మంత్ రావు, నర్సింహ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అజేందర్ రెడ్డి, మురళి, అకౌంట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article