- పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తుల పై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్పూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలని అన్నారు. ఈ సంవత్సరకాలంలో వారి వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషములతో కాలం గడపాలని పేర్కొన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వేషాలకు తావు ఇవ్వకుండా అందరు సహకరించాలని సూచించారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావంతో మెలుగాలని కోరారు.
