జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  దసరా పండుగను  పురస్కరించుకుని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ జిల్లా ప్రజలకు  శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తుల పై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్పూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలని అన్నారు. ఈ సంవత్సరకాలంలో వారి వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషములతో కాలం గడపాలని పేర్కొన్నారు.  నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వేషాలకు  తావు ఇవ్వకుండా అందరు సహకరించాలని...