నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పలు డివిజన్‌లలో గల అమ్మవారి మండపాలను శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవాని మాల ధరించే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుండటం సంతోషకరమని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అభిలాషించారు. అదేవిధంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది రోజుల నవరాత్రి పూజలో పాల్గొంటూ ఉపవాస దీక్ష చేపడుతున్నారని, దేశ ప్రజల సుభిక్షత కోసం అమ్మవారిని సేవిస్తూ హిందూ మతాన్ని కాపాడటంలో ఆయన ప్రమేయం విశేషమని పేర్కొన్నారు. మోడీ మహాయోగి, అమ్మవారి ఉపాసకులుగా ఉన్నారని, వారి నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాల్లో ముందుకు సాగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మండప నిర్వాహకులు, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.

