29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వే చేయాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

మా భూమిలో సర్వే చేయాలని నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని భవాని పేట గ్రామని కి చెందిన రైతు గంగని చిన్న నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 841/23లో తనకి 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, సర్వే చేయాలని పాల్వంచ మీ సేవ కేంద్రాల్లో రెండు సార్లు ఛలాన్ కట్టినా, పాల్వంచ సర్వేయర్ ఆ భూమిలో ఇప్పటివరకు సర్వే చేయడం లేదని అన్నారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని, సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లా సర్వేయర్ ను పిలిపించి రెండు రోజులలో సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు.

More articles

Latest article