30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభకు రూ. 21 వేల విరాళం ప్రకటించిన ముఖ్రా(కె) గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

జగిత్యాల, బతుకమ్మ:

 

జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం ముఖ్రా(కె) గ్రామ రైతులు తమ వంతుగా రూ. 21 వేల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం విరాళాన్ని గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేవారని, ముఖ్రా(కె) గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని గుర్తుచేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని వారు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని వారు ఆకాంక్షించారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో సేకరించిన ఈ రూ.21 వేల విరాళాన్ని.. రేపు జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందజేయాలని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు దత్తా, తిరుపతి, ప్రహ్లాద్, లక్ష్మి, అర్చన, దైవశాల గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article