. . . వంజరి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మాస్టర్ శంకర్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
జిల్లా సంఘం సభ్యులందరినీ ఏకతాటిపై ఉంచి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మాస్టర్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మామిడి పల్లి వంజరి సంఘం కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి సేవలందిస్తున్న మాస్టర్ శంకర్ ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు బోనేకర్ భూమయ్య నుంచి మాస్టర్ శంకర్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శి గా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారి గా కరిపే మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగోనే మల్లేష్, కోశాధికారి నవతే నర్సయ్యతో పాటు జిల్లా, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

