30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్ల వేళలా కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యూనివర్సిటీ సమస్యల పైన తన గళం వినిపించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన పాలక మండలి సభ్యునిగా నియామకమైన చెరుకూరి రజనీకాంత్ ను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకై పాలకమండలి సమావేశాల్లో చర్చించి, యూనివర్సిటీ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని, యూనివర్సిటీలో గతంలో వచ్చిన ఆరోపణలపై తన గళం వినిపించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా రజనీకాంత్ నియమకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article