. . . అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు
. . . మిగిలిన రెండు బిల్లులూ ఉపసంహరణ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
మహిళా రిజర్వేషన్ ముందస్తుగా అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేస్తూ తెచ్చిన బిల్లు లోక్ సభలో వీగిపోయింది. ఈ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా డివిజన్ ఓటింగ్ నిర్వహించగా మొత్తం 489 మంది ఎంపీలు ఓటేశారు. అందులో 278 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 211 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి రాజ్యాంగ సవరణ ప్రయత్నం జరగదని స్పష్టం చేశారు.

మహిళా కోటా చట్టం రాజ్యాంగ సవరణకు సభలొ మూడింట రెండు వంతుల ఓట్ల మద్దతు అవసరం. లోక్ సభలో మొత్తం ఎంపీల సంఖ్య 543, అందరూ హాజరైతే బిల్లు పాస్ కావడానికి 360 ఓట్లు అవసరం, కానీ ఈ రోజు సభకు 528 మంది ఎంపీలు హాజరయ్యారు. దీంతో మెజార్టీ మార్క్ 352 కు తగ్గిపోయింది. ఈ 528 మంది ఎంపీల్లో 298 మంది మద్దతు మాత్రమే రావడంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 230 మంది రాజ్యాంగ సవరణను వ్యతిరేకించారు. ఓటింగ్ తర్వాత స్పీకర్ ఓం బిర్లా మ్యానువల్ ఓట్ల లెక్కింపు వివరాలను ఈ మేరకు వెల్లడించారు. ఎన్డీయే బలం 293, అంటే ఒక ఐదు ఓట్లు ప్రతి పక్షాల నుంచి మద్దతు లభించినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా ప్రతి పక్షాలన్ని ఏకపక్షంగా బిల్లు ను వ్యతిరేకించడం గమనార్హం, మొత్తంగా 54 ఓట్ల తేడాతో ఈ బిల్లు వీగిపోయింది.
మిగిలిన రెండు బిల్లులను ఓటింగ్ కు పెట్టడానికి కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిరాకరించారు. అదే సందర్భంలో చారిత్రక మహిళా కోటా సంరణ బిల్లును వ్యతిరేకించిన ప్రతి పక్షాలను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అపోజిషన్ పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు వీగిపోయినందున డీలిమిటేషన్ బిల్లు, యూటీల్లో మహిళా కోటా అమలుకు సంబందించిన బిల్లును ఓటింగ్ కు పెట్టడం లేదని, వాటిని ఉపసంహరించు కుంటున్నట్టు స్పష్టం చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అందుకు అంగీకరించి సభను వాయిదా వేశారు.
