26.6 C
Hyderabad
Monday, August 3, 2026

లింగంపేట్ ఎమ్మార్వో ఎంపీడీవోలకు ఉపాధ్యాయుల వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ : 

 

టీజీ జేఏసీ ఆధ్వర్యంలో లింగంపేట మండల ఎమ్మార్వో, ఎంపీడీవోలకు మండలంలోని ఉపాధ్యాయులందరూ తమ డిమాండ్లపై శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. జూన్ 2 తేదీ నాటికి పిఆర్సీ అమలు చేయాలని,రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలన్నారు. హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానంను పునరుద్దరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఎ ల సమస్యలు పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

More articles

Latest article