నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల బిఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ దేశం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, తాడిత పీడత వర్గాల కోసం, అణచివేత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటం రాజ్యాంగ రూపకల్పన గూర్చి ఆయన చేసిన కృషిని కొనియాడారు. శతాబ్దాలకు ఒకరు మాత్రమే దేశ ఔన్నత్యానికి తోడ్పడుతారని వారిలో అంబేద్కర్ ఒకడని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్, బాలగంగాధర్, సయ్యద్ హుస్సేన్, దారం సురేష్, రామారావు, తాటికాయల సుభాష్, మాజీ ఉప సర్పంచ్ భరత్, వార్డు మెంబర్లు రాజేందర్, సాయిలు, రమేష్, తాటికాయల సాగర్, జూల రవి, రాజేశ్వర్, మేకల చిన్నయ్య, బాలరాజ్, బాలు, ధర్మపురి, శ్రీనివాస్, అశోక్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

