27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫంక్షన్ హాళ్ళు, ఫాంహౌజ్ లకు మళ్ళీన పేకాట

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీసీఎస్ దాడులతో బహిర్గతమైన జూదం

 

. . . అంతా లోకల్ కనుసన్నుల్లోనే పత్తాలాట

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

కాలక్షేపం కోసం ఆటవిడుపు అని ఆంధ్రా నుంచి మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన పత్తాలాట ఇందూర్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. పోలీసు శాఖ పేకాటపై నజర్ వేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నిజామాబాద్ జిల్లాలో రిక్రియేషన్ మాటున క్లబ్బులో పేకాట నడిచిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేకాట క్లబ్ లపై నిషేదం విధించడంతో నిజామాబాద్ జూదగాళ్ళు పొరుగున ఉన్న మహారాష్ట్ర మొదలుకుని గోవా నుంచి దుబాయ్, మలేషియా వరకు వెళ్లి పత్తాలాడిన విషయం విధితమే. ఈ నెల 13న ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులోని తిరుమల ఫంక్షన్ హాల్ లో  పేకాట ఆడుతున్నారని పోలీసు బాస్ కు వచ్చిన సమాచారంతో ఆయన సీసీఎస్ కు రంగంలోకి దించారు. సీసీఎస్ పోలీసుల దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్ళు, లక్షా 80 వేల పై చిలుకు నగదు, కార్లు, సెల్ ఫోన్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన వారిలో భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, ఆర్మూర్ అధికార పార్టీ కౌన్సిలర్ వెంకట్ గౌడ్ పట్టుబడ్డారు. దాంతో పోలీసులే షాక్ కు గురయ్యారు. పొలిటికల్ లీడర్లు పట్టుబడిన పేకాట రాయుళ్లను తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోలీసు రైడింగ్ వ్యవహరం మీడియాలో వచ్చే సరికి వెనక్కి తగ్గని పరిస్థితి నెలకొంది.

 

Poker returns to function halls and farmhouses

 

నిజామాబాద్ జిల్లాలో పేకాట రాయుళ్ళు గతేడాది వరకు మహారాష్ట్రలోని అప్పారావుపేట్ తో పాటు బిలోలి, దెగ్లూర్ లో క్లబ్ లలో జూదం సాగింది. అయితే అప్పారావుపేట్ వెళ్తున్న వారిపై నిర్మల్ పోలీసులు వరుస దాడులతో అటువైపు వెళ్లేందుకు పేకాటరాయుళ్ళు భయపడుతున్నారు. నిజామాబాద్ కు చెందిన మాజీ జడ్పీటీసీ, మాక్లూర్ మండలంకు చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధి, కామారెడ్డి జిల్లా పిట్లం మండలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పేకాట జోరుగా సాగింది. అయితే సుదూర ప్రాంతానికి వెళ్లేందుకు పేకాట రాయుళ్ళు సిద్దంగా లేకపోవడంతో పత్తాలాట ఫంక్షన్ హాళ్ళకు షిప్ట్ అయింది. నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పేకాటను గతంలో పోలీసులు గుట్టురట్టు చేశారు. దాంతో పాటు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన క్యాసినో తరహా పేకాటను పోలీసులు దాడి చేసి పత్తాల రాయుళ్లను కటకటలా పాలు చేశారు. నందిపేట్ మండలంలోని ఓ గ్రామంలో ఫంక్షన్ హాల్ పై పోలీసులు దాడి చేసి జూదాన్ని కట్టడి చేశారు. దాని తర్వాత చాలా రోజులకు మరోసారి పెర్కిట్ లోని తిరుమల గార్డెన్ లోని పత్తాలాట వ్యవహరం బహిర్గతమైంది.

 

Poker returns to function halls and farmhouses

 

నిజామాబాద్ జిల్లాలో ఆటవిడుపుతో పాటు కొందరికీ పత్తాలాట ఆర్థిక వనరుగా మారింది. వారు పేకాటరాయుళ్ళను నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు, గోవా, మలేసియా, దుబాయ్ తరలించి పత్తాలాడించడం చేస్తున్నారు. అక్కడికి రావడానికి వెనుకడుగు వేసే వారికి వాట్సాప్ గ్రూపులను తయారు చేసి సరిహద్దు ప్రాంతాల్లో పత్తాలాడిస్తున్నారు. తాజాగా మరోసారి పత్తాలాటను ఫాంహౌజ్ లకు, ఫంక్షన్ హాళ్ళకు మరిలిచినట్లు తెలిసింది. ఆర్మూర్ రూరల్ ఏరియాలో పత్తాలాట గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు పంట పొలాల మధ్య ఉన్న గెస్ట్ హౌజ్ లో సాగుతుంది. గతంలో పలుమార్లు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, జడ్పీటీసీలు, లీడర్లు పత్తాలాడుతూ పట్టుబడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ శివారుతో పాటు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లో పత్తాలాట జోరుగా సాగుతుంది. మద్యంతో పాటు మంచింగ్ ఏర్పాటు చేస్తుండడంతో పేకాట రాయుళ్లను గెస్ట్ హౌజ్ లకు, ఫాంహౌజ్ లకు బారులు తీరుతున్నారు.

More articles

Latest article