27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని, ప్రతి ఊరిలో బడుగు బలహీనుల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ విగ్రహం ఉండాల్సిందేనని యువకులు నల్లూరి నర్సయ్య, తెడ్డు భాస్కర్, తెడ్డు విఠల్, తెడ్డు సాయి కుమార్ అన్నారు. మంగళవారం ధర్పల్లి మండలం వాడి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్సీ కాలనీ నుంచి బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి సంఘం పెద్దలు పాలాభిషేకం, చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన తెచ్చిన సంస్కరణల వల్లనే ఈరోజు ప్రజలందరూ ఫలాలు అందుకుంటున్నారన్నారు. 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజలు అంబేద్కర్ ను కొందరివాడు అనుకుంటున్నారని, ఆయన అందరివాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబాన్న, దశరథ్, సుభాష్, నరేందర్, బాల్ రాజ్, సాయిలు, సాయి రాం, బాల్ రాజ్, కిరణ్, రాజేష్, దిలీప్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article