29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టూ టౌన్ పరిధిలోని కమ్యూనల్ రౌడీషీటర్ లకు కౌన్సిలింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజ్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ ఏదైనా నేరంలో పాల్గొంటే అలాంటి వారి పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేనియెడల చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని నగర సీఐ హెచ్చారించారు. గురువారం పోలిస్ స్టేషన్ అవరణలో కమ్యూనిటి సస్పెక్ట్ షీట్ లు కలిగిన రౌడిషీటర్లకు నగర సీఐ కౌన్సిలింగ్ ఇచ్చి వారు పద్ధతి మార్చుకొని పక్షంలో సరైన నడవడిక లేనిపక్షంలో ఎక్కువ కేసులు ఉన్న వారి పైన పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకి పంపిస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన కలిగి ఉంటే అలాంటి వారి పట్ల వారి యొక్క షీట్ ని కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కౌన్సిలింగ్ టూ టౌన్ ఎస్ఐ యాసీర్ అరాపత్ అధ్వర్యంలో జరిగింది.

More articles

Latest article