. . . చికిత్సకు తరలిస్తుండగా ఏఎస్ఐ మృతి
. . . పరారైన హోంగార్డు
సంగారెడ్డి, బతుకమ్మ:
ఏఎస్ఐ ను పెట్రో కారుతో గుద్ధి చంపేశాడు ఒ హోంగార్డు. ఈ సంఘటన మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీస్ స్టేషన్ ముందు సోమవారం ఎఎస్ఐ గోవింద్ నాయక్ వెలుతుండగా మొబైల్ పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న రామారావు అనే హోంగార్డు అతను గుద్దేశాడు. ఈ ఘటనలో గోవింద్ నాయక్ తీవ్ర గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీస్ వాహనం వదిలి హోంగార్డు రామారావు పరారీ అయ్యారు. గోవింద్ నాయక్ ను కక్ష్యతో కారుతో గుద్ది హత్య చేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు రామారావు కోసం గాలిస్తున్నారు. హోంగార్డు ఈ ఘాతుకానికి తెగబడాటానికి వేదింపులు కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
