25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎంఆర్ఎఫ్

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి అన్నారు. వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సోమవారం డొంకేశ్వర్ మండలం దత్తపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు బానోవత్ శోభా రూ.32 వేలు, సుంకరి ముత్తెన్న రూ.23 వేలు, మూడ్ లక్ష్మి రూ.14 వేలు, వాసని ముత్యం రూ.13500 ల చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, అర్హులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రకాష్, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

CMRF stands by the vulnerable sections of the society

More articles

Latest article