27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళా బిల్లు చారిత్రాత్మక ఘట్టం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీ అర్వింద్ ధర్మపురి

నిజామాబాద్, బతుకమ్మ:

మహిళా బిల్లు చారిత్రక ఘట్టం అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఎంపి విలేఖరులతో మాట్లాడుతూ…. ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేయడం దారుణం అన్నారు. మహిళ బిల్లు 2026 కు చట్ట సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.మహిళా రిజర్వేషన్ల తో పాలనలో పారదర్శకత ఉంటుంది అవినీతి తగ్గుతుందని వివరించారు మహిళా బిల్లును కూడా రాజకీయం చేసేందుకు.విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏనాడు కూడా మహిళా బిల్లుకు మోక్షం లభించ లేదని అన్నారు. దేవేగౌడ హయంలో ప్రయత్నాలు జరిగిన దానిని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మహిళ బిల్లును ఆమోదించడం ద్వారా చట్ట సభలు మహిళ ప్రాధన్యత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే దేశంలో 14 లక్షల మంది రాజకీయాలలో రాణిస్తున్నారని, మహిళా బిల్లుకు చట్టరూపం రావడంతో చట్ట సభల్లో సగానికి పైగా మహిళలకు అవకాశాలు ఉంటాయన్నారు..

Women's Bill is a historic event
Women’s Bill is a historic event

డిలిమిటేషన్ వలన దక్షిణ భారతదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు…

దేశంలో పెరిగిన జనాభా ఆధారంగా జరుగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వలన దక్షిణ భారతదేశానికి వచ్చిన ముప్పేమీ లేదని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో డిలిమిటేషన్ వలన దాదాపు సగానికి పైగా పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, సభ నిర్వహణకు అనుగుణంగా నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్నా పార్లమెంట్ స్థానాలు రెండింతలు అవుతాయని అన్ానరు.దక్షిణాది రాష్ట్రాల్లో సగానికి పైగా స్థానాలు పెరుగుతాయని దానిని స్వాగతిస్తున్న మన్నారు. డిలిమిటేషన్ లో పెరిగే స్థానాల్లో మహిళలతో పాటు, ఎస్సీ, ఎస్టీ స్థానాలు పెరుగుతాయని అన్నారు. మహిళలకు బిజేపి ప్రాధన్యత ఇస్తుందని అన్నారు. చట్ట సభల్లో బిసిల రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నారు. ఆనాడు మండల కమీషన్ సిపారసులకు వ్యతిరకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

Women's Bill is a historic event
Women’s Bill is a historic event

 బిజేపిలో గ్రూప్ రాజకీయాలకు తావు లేదు…

డాక్టర్ లక్ష్మణ్ తో నాకు ఎలాంటి గ్యాప్ లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు. నేను చిట్ చాట్ చేయనని అంత ఓపెన్ గా మాట్లాడ తానని తెలిపారు.ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ ఐకాన్ అని ఆయనతో కూడా నాకు ఎక్కడా గ్యాప్ లేదని చెప్పారు. పైడి రాకేష్ రెడ్డి వయస్సు రీత్యా పెద్దవాడు తనకు సోదర సమానుడు అని అన్నారు.అతడిని రాజకీయాలలోకి తెచ్చింది తానేనని అన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆర్మూర్ లో బీజేపీ గెలుపులో తనకు బాగస్వామ్యం ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ కి మెజారిటీ సీట్లు సాధించే రేసులో నేను ముందుంటాను అదే నా లక్ష్యమని అన్నారు. తన కుటుంబం పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత కలిగి ఉందని గుర్తు చేశారు.బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదని అన్నారు.అవినీతి అక్రమాల పార్టీ తో అలయెన్స్ ఎందుకని ప్రశ్నించారు.పదేళ్లు కేసీఆర్  ఒక్క  మంచి పని చేయలేదని అప్పులు చేసి పింఛన్లు ఇచ్చారని మండిపడ్డారు.తెలంగాణలో ఒంటరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ కూడా ఖాళీ అవుతుందని అన్నారు.కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల మధ్య అసలైన అలయెన్స్ నడుస్తోందని ఆరోపించారు.సీఎం రేవంత్ కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ కేటిఆర్ లవి దొంగ నాటకాలు మండిపడ్డారు. బీఆర్ఎస్, కవిత పార్టీ ల మధ్య అలయెన్స్ ఉంటుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ, పసుపు బోర్డు చైర్మెన్ పల్లే గంగారెడ్డి, నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, ప్లోర్ లీడర్ ప్రమోద్ తదితరులు పాల్గోన్నారు..

 

 

More articles

Latest article