. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒక వేళ డ్రగ్స్ కు అలవాటు పడితే తగిన ట్రీట్ మెంట్ తీసుకొని బయట పడాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు లకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రాజశ్రీ, డ్రగ్ ఇన్స్ పెక్టర్ శ్రీకాంత్, శ్రీలత, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెచ్ ఓ.డి డా.నాగమోహన్, నోడల్ ఆఫీసర్ డా.రాజేందర్, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

