26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టోల్ ప్లాజాల్లో నగదు రహిత చెల్లింపులు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు తో పాటుగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలో ఏప్రిల్ 10 నుండి నగదు రహిత చెల్లింపులు మాత్రమే అనుమతించడం జరుగుతుందని భిక్కనూరు టోల్ ప్లాజా మేనేజర్ దుర్గా ప్రసాద్, ముని ప్రకాష్ తెలిపారు.   శుక్రవారం వారు మాట్లాడుతూ సంపూర్ణ డిజిటల్ జాతీయ రహదారి టోల్ నివాసము అభివృద్ధి చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల టోల్ ప్లాజాలలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారుల టోల్ ప్లాజా లో టోల్ చెల్లింపు కేవలం పాస్ట్ టాగ్ లేదా యూపీఐ ద్వారానే చెల్లింపులను స్వీకరించడం జరుగుతుందన్నారు. వాహనదారులు టోల్ ప్లాజా సిబ్బందికి సహకరించి నిబంధనలను పాటించాలని కోరారు.

More articles

Latest article