29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాదిగల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీఎంఆర్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవీన్ మాదిగ

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

మాదిగల హక్కుల కోసం టీఎంఆర్ పీఎస్ నిరంతరం కృషి చేస్తుందని టీఎంఆర్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవీన్ మాదిగ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన టీఎంఆర్ పీఎస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు టీఎంఆర్ పీఎస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీఎంఆర్ పీఎస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడిగా కర్రోల్ల ఆకాష్ మాదిగను నియమిస్తున్నామని తెలిపారు. ఇటుక రాజు నాయకత్వంలో మాదిగలంతా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతగా కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ, కాశిగోళ్ళ సంజయ్, సాయి రామ్, అజయ్, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

 

We are constantly working for our rights.

More articles

Latest article