27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్టు పై ఎసిబి రైడ్

Must read

📰 Generate e-Paper Clip

 

.. . .  లంచం తీసుకుంటు దోరికిన సిఐ ,ఎస్ఐ లు

హైద్రాబాద్, బతుకమ్మ:

నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఓక వ్యక్తి నుంచి15 లక్షలు డిమాండ్ చేసిన పోలిసుల గుట్టును అవినీతి నిరోదకశాఖ రట్టు చేసింది. బుదవారం హైద్రబాద్ లోనిశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏసీబీ ట్రాప్ చేసి  ఇద్దరు పోలీస్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని  అరెస్ట్ చేసింది. ఇటివల కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలి పాస్ పోర్టు కలిగిన వ్యక్తిని పోలిసులు అరెస్టు చేశారు. బాధితుడు బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత  ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్టులో పనిచేస్తున్న సీఐ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ లు రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ₹5 లక్షలకు బేరం కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టారు. ఔట్ పోస్టులో రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి  సిఐ కనుకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్ లను అరెస్టు చేసి  ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

More articles

Latest article