. . . అదే రోజు పార్టీ పేరు ప్రకటిస్తాను
. . . వచ్చే జడ్పీ ఎన్నికలలో స్వంతంగా పోటి చేస్తాం
. . . తెలంగాణకు నేక్స్ట్ సీఎం మహిళనే
. . . తెలంగాణ ప్రజలు కొత్త పార్టీని ఆహ్వానించి ఆదరిస్తారు
. . . కూతురిపై తండ్రిగా కేసిఆర్ ఆశీస్సులు ఉంటాయి
. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ఏర్పడినప్పటికి అమరుల త్యాగాలు, వారి ఆశయాల మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాము.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రావాలని బలంగా విశ్వసిస్తున్నాము అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత అన్నారు. ఏప్రిల్ 25న తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు అదే రోజు పార్టీ పేరును ప్రకటిస్తానని కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలొ మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను రాజకీయంగా ఎదిగింది ఆశీర్వదించింది నిజామాబాద్ జిల్లా నుంచే నని, అందుకే ఇక్కడి ప్రజల అశీస్సులతో కొత్త పార్టీ ప్రకటన ఆ శ్రీ రాముని అశీస్సులతో ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమం చేయలేదని అన్నారు. రేవంత్ సర్కార్ పంటలు చేతికి వచ్చే సమయంలో రైతు బందు విడుదల చేస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు రోడ్డేక్కలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బిజేపి అధికారంలో ఉండి తెలంగాణలో ఎన్ని కొత్త పరిశ్రమలు, ఎన్ని నిధులు తెచ్చారని అన్నారు. మూసి ప్రాజెక్ట్ మీద ఎమ్మెల్సీగా తాను డిపిఆర్ లేదని తొలుత ప్రశ్నించింది తానేనని గుర్తు చేశారు. డిపిఆర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డైరక్టుగా బ్యాంకుల అప్పుల కోసం వెలుతుంటే జాతీయ పార్టీలు ఐనా బిజేపి, బిఆర్ఎస్ ఎందుకు ప్రభుత్వ చర్యలను అడ్డుకోలేదని అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రత్యామ్నయ రాజకీయ పార్టీ ఏర్పాటు ఆవశ్యకత ఉందని అన్నారు. బిసిల రిజర్వేషన్ ల కోసం తెలంగాణ జాగృతి ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం కుల గణన ప్రకటన చేసిందని గుర్తు చేశారు. తన నాయకత్వంలోనే అసెంబ్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు యూనైటేడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆదోళన చేశానని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ల చట్టబద్ధత కుడా తన పోరాటాల ఫలం అని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బిసీల ఐక్యతతో కలిసి బావసారుప్యత కలిగిన వ్యక్తులతో 27 రోజుల పాటు చర్చలు, సమాలోచనలను జరిపి ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు రాజకీయ పార్టీని మేడ్చల్ జిల్లా మొయినాబాద్ లో ప్రకటిస్తానని అన్నారు. ఇటీవల టెకుమట్ల బాధితుల కోసం ఆమరణ నిరాహార దీక్షకు బిసీఎస్సీఎస్టీ జేఎసీతో ఉద్యమం చేయగా ప్రభుత్వం దిగివచ్చి బాధితులకు ఇండ్లు కట్టించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. త్వరలో పెట్టబోయే రాజకీయ పార్టి ఎజేండా, అశయాలను, పార్టీ పేరును అదే రోజు ప్రకటిస్తాని తెలిపారు. తెలంగాణలో తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి తండ్రిగా కేసిఆర్ ఆశీస్సులు తనపై ఉంటాయని అన్నారు. యువత రాజకీయలకు దూరంగా ఉండవద్ధని కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి కి గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారని, రాబోయే రెండున్నర సంవత్సరాలలో కొత్త పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఇప్పటికి చాలా మంది లీడర్లు, ప్రజా ప్రతినిధులు తనతో టచ్ లో ఉన్నప్పటికి తనకు ప్రజా బలం ముఖ్యమని కాన్షీరాం ఆలోచన విధానం మేరకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేయగలను. గల్లీలో కష్టపడగలను నేను ఎంపీ అయినప్పుడు నిజామాబాద్- పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేస్తానని అంటే నవ్వారు. 25 ఏళ్లుగా జరగనిది ఇప్పుడు అవుతుందా అన్నారు. కానీ మూడేళ్లలో నేను ఆ పని చేసి చూపించా అని గుర్తు చేశారు.

