28.8 C
Hyderabad
Monday, August 3, 2026

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం శ్రీ రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సీతారాముల కళ్యాణ వేడుకలు కొనసాగాయి. ఈ కళ్యాణ వేడుకల్లో రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహరతులు చేపట్టి సీతారాముల కళ్యాణ వేడుకలను జరిపించారు. అలాగే ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నారాయణ శర్మ, రాము శర్మ, రామాలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article