అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం శ్రీ రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సీతారాముల కళ్యాణ వేడుకలు కొనసాగాయి. ఈ కళ్యాణ వేడుకల్లో రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహరతులు చేపట్టి సీతారాముల కళ్యాణ వేడుకలను జరిపించారు. అలాగే ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన...