. . . పలు వాహనాలు ధ్వంసం
. . . ముగ్గురికి గాయాలు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణంలో రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కాగా ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి బస్టాండ్ నుంచి ఓ కారు రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చి పట్టణంలోని జయ ఆసుపత్రి వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ లు, అంబులెన్స్ ను ఢీకొట్టింది. దీంతో కారుతో పాటు బైక్ , అంబులెన్స్ ధ్వంసం కాగా ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
