27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పదని, ఔషధాల తయారీ సమాజ క్షేమమే పరమావధిగా కొనసాగాలని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి టి. యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఔషధ రంగం ప్రపంచంలో గణనీయమైన పురోగతిని సాధించి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.

 

The importance of chemistry in pharmaceutical manufacturing is immense.

 

ముఖ్య వక్త అరబిందో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్ కు తీసిపోదని, జనరిక్ మెడిసిన్ మాత్రమే సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు లభిస్తుందని పేర్కొంటూ యువ శాస్త్రవేత్తలు జనరిక్ మెడిసిన్ పైన లోతైన పరిశోధనలు చేసి వాటిని పేద ప్రజలకు మరింత దగ్గర చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డా.లింగయ్య నాగారపు, డా.శంకరయ్య, కన్వీనర్ డా.సాయిలు, కో కన్వీనర్. డా.డి నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ డా.ఏ నాగరాజు డా.బాలకిషన్, అధ్యాపకులు డా.గంగా కిషన్, డా.రాజేశ్వరి, డా.డేనియల్, డా.సురేష్, డా.నాగేశ్వరరావు, డా.నాగేంద్రబాబు, డా.సునీత, డా.శర్మ, డా.శ్రీకాంత్, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article