భిక్కనూర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల మూఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎఏస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ… ఈ నెల 23న భిక్కనూర్ గ్రామానికి చెందిన పూజారి ఉదయం వేళ గుడి తెరిచి చూడగా ఆలయంలో పంచలోహ అమ్మవారి విగ్రహంతో పాటు రెడిమెడ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతుండగా సీసీ టీవీ ఫుటేజీలు, సాంకేతిక అధారాలతో భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన మట్టే అచ్యూత్, కోక్కు గణేష్ లు చోరీలకు పాల్పడ్డట్టు గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైక్ లు, పెద్దమ్మ ఆలయం నుంచి చోరి చేసిన విగ్రహం, రెండు సీసీ కెమెరాలు, రోల్డ్ గోల్డ్ చైన్, రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మట్టే అచ్యూత్ గతంలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసుల్లో అరెస్టు అయి జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తరువాత 2025లో కామారెడ్డి, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులలో ప్రమేయం ఉంది. కొక్కు గణేష్ పై నల్గోండ జిల్లా పరిధిలో 13 కేసులలో నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. అతి తక్కువ కాలంలో చోరీల కేసుల చేదించిన భిక్కనూర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సంపత్, ఎస్ఐ ఆంజనేయులు లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

