ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  భిక్కనూర్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల మూఠా సభ్యులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎఏస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ... ఈ నెల 23న భిక్కనూర్ గ్రామానికి చెందిన పూజారి ఉదయం వేళ గుడి తెరిచి చూడగా ఆలయంలో పంచలోహ అమ్మవారి విగ్రహంతో పాటు రెడిమెడ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ...