. . . స్లిప్పులు ఇచ్చి గురువులు స్థాయి తగ్గించుకోకండి
. . . ఫ్లకార్డులతో ఇద్దరు విద్యార్ధినీల ప్రదర్శన
నిజామాబాద్, బతుకమ్మ:
మా పరిక్షలు మమ్మల్ని రాయనీవ్వండి, మాకు పరీక్షల్లో స్లిప్పులు ఇచ్చి మా వద్ద మీ స్థాయి తగ్గించుకోకండి. బాగా చదువుకునే విద్యార్ధులకు, చదువని విద్యార్ధులకు ఒకే విధమైన మార్కులు రావడం నాకు న్యాయం అనిపించడం లేదని ఇద్దరు విద్యార్ధినీలు పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద ప్రదర్శించిన ఫ్లకార్డుల ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 18న జరిగిన పదో తరగతి హింది ప్రశ్నపత్రం ను ప్రభుత్వ ఉపాధ్యాయులే లీక్ చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా 7 గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు ఆలస్యంగా స్పందించి పరీక్ష కేంద్రాలలోకి సెల్ ఫోన్ అనుమతి లేదని ప్రకటించారు. తరువాత రోజు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై వార్నింగ్ ఇచ్చారు. సీఎస్, డిఓలు ప్రశ్నా పత్రాలను బయటకు పంపడం వాటి ద్వారా జవాబు స్లిప్ లు పరీక్ష కేంద్రాలలోకి వచ్చి విద్యార్ధులు పరిక్షలు రాస్తున్న వ్యవహరం ఇప్పుడు విద్యాశాఖలొ చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో విద్యార్ధులు సైతం మాస్ కాఫీయింగ్ పై గళమెత్తడం పరిక్షల నిర్వహణ తీరును ప్రశ్నించడం మొదలైంది. చదువుకున్న విద్యార్ధులు, చీట్టిలతో (మాస్ కాఫీయింగ్) తో పరిక్షలు రాసీ మార్కులు తెచ్చుకున్న వారు సమానమేనా అని విద్యార్ధినీలు ప్లకార్డులు ప్రదర్శించడంతో హై క్లాస్ చదువుతున్న విద్యార్ధులు కుడా ఎంతో మెచ్యూర్ గా అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ టీచర్ ల వద్ద, అధికారుల వద్ద సమాదానం లేదు. ఏకంగా తమకు చదువు చెప్పిన గురువులను విద్యార్ధులు ప్రశ్నించే స్థాయికి ఎదగడం మంచి పరిణామం. ఇప్పుడు సంబంధిత ఫోటో లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
