రుద్రూర్ బతుకమ్మ :
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ మాట నిలబెట్టుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ ముందస్తు చర్యలు చేపట్టారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 5 వ వార్డులో సోమవారం గ్రామ సర్పంచ్ బోరు మోటార్ వేయించారు. ప్రజలకు మంచినీటి పంపిణీ చేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. రుద్రూర్ గ్రామంలోని పలు వార్డులలో ఆరు బోరు మోటార్లు వేయించామన్నారు. బోరు మోటార్లు వేయించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు మెంబర్ పార్వతి పూజిత నరేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.