. . . మార్కెట్ యార్డులో దొంగలు పడ్డారు కథనానికి స్పందన
. . . కమిషన్ ఏజంట్ లైసెన్స్ వారం రోజుల పాటు రద్దు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకం కోసం తెచ్చిన పసుపు దొంగతనంపై బతుకమ్మ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన మార్కెట్ యార్డులో దొంగలుపడ్డారు కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన సరుకును కాపాడడంలో విఫలమైన ఒక కమిషన్ ఏజంట్ కు సంబంధించిన లైసెన్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సదరు వ్యాపారి మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు చేయవద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరి అపర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు తెచ్చిన సరుకులు తూకం అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత వ్యాపారులదేనని ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే కమిషన్ ఏజంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.

