28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, బీర్కూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పొట్లూరి ఆనంద్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం బీర్కూర్ మండల మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు కుమారుడు తిలకేశ్వరి రమాకాంత్ స్వర్గస్తులైనారు. ఆదివారం బీర్కూర్ లోని వారి ఇంటికి వెళ్లి తిలకేశ్వరి రఘు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అనంతరం బీర్కూర్ గ్రామ పంచాయతీ ప్రకాశరావు క్యాంపు పొట్లూరి ఆనంద్ కుమారుడు పొట్లూరి లలిత్ ఆర్యన్ మరణించడంతో ఈ రోజు దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం వెంట ఉన్నారు.

More articles

Latest article