28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

2023 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ను వర్తింపజేయాలి…

Must read

📰 Generate e-Paper Clip

. . . సీయం సలహదారు వేం నరేంధర్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:                                                                                          

కేంద్ర ప్రభుత్వ మెమో 57ఆధారంగా 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు  వేం నరేందర్ రెడ్డి కి 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి విన్నవించింది. హైదరాబాద్ లోని సచివాలయం లో మంగళవారం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు  వేం నరేందర్ రెడ్డి ని టిపిసీసీ అధికార ప్రతినిధి  గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ అభ్యర్థనను పరిశీలించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ మెమో 57ఆధారంగా 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని  అమలు చేయాలని దీనివలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అదనపు భారం పడదని, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రెండు వేయిల కోట్లు జమ అవుతాయని తెలిపారు, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాలు అమలు చేశాయని తెలియజేయగా వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి ఇమ్మడి సంతోష్ కుమార్, రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, రవింధర్, పరమేశ్వర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

2023 to apply old pension to working teachers...

More articles

Latest article