24 C
Hyderabad
Sunday, August 2, 2026

13 నుంచి  నిజామాబాద్ మీదుగా కాజీపేట – దాదర్ రైలు

Must read

📰 Generate e-Paper Clip

. . . నిజామాబాద్ మీదుగా రైలు నడపాలని రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్

. . . హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

 నిజామాబాద్ , బతుకమ్మ:                                                                                                         

గత తొమ్మిది నెలల నుండి  అయోధ్య ప్రయాణికుల కోసం రద్దు చేయబడ్డ కాజీపేట – దాదర్ (07195/96) రైలు ఎట్టకేలకు ఈ నెల 13 నుంచి మళ్లీ పట్టాలెక్కనుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ లోని  జగిత్యాల, కోరుట్ల,మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల నుండి వివిధ పనుల అవసరాలకు  ముంబై వెళ్లనున్న ప్రయాణికుల  బాధలు తప్పనున్నాయి. గత తొమ్మిది నెలల క్రితం అయోధ్య కొరకు రద్దు చేయబడ్డ ఈ రైలు నడపాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది . ఇట్టి రైలును  పునరుద్ధరించాలని  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ రైల్వే మంత్రిని అశ్విని వైష్ణవ్ ను, ఉన్నతాధికారులను పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే . గత 15 రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంపీ  అర్వింద్ మరో మారు రైల్వే మంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో  రైలు ప్రారంభించేలా తగిన చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. అట్టి భేటీలోనే అది కొద్ది రోజుల్లో ఈ రైలు పున ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దానికనుగుణంగా  రైల్వే ఉన్నతాధికారులు  కాజీపేట -దాదర్  (07195/96)  రైలును  మొదట నవంబర్ 28 వరకు పొడిగించారు. విషయం తెలుసుకున్న అర్వింద్ ఈ రైలును నిరంతరం రెగ్యులర్ ట్రైన్ గా  నడిపించాల్సిందేనని రైల్వే అధికారులను పట్టుపట్టారు. ఎంపీ అర్వింద్ కోరిక మేరకు ఈ రైలు 2025 జనవరి 30 వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఉత్తర్వుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపారు.

13 Kazipet - Dadar train via Nizamabad

 

More articles

Latest article