29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విజయవంతమైన జాబ్ మేళా

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శి రాముల కళ్యాణ మండపంలో జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జాబ్ మేళాకు కామారెడ్డి, భిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, పాల్వంచ, రామారెడ్డి మండలాలతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా యువత ఇంటర్యూకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరు కాగా, జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. 50 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరు కాగా, 3500 మంది నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొన్నారు. ఇందులో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, మెడికల్, బ్యాంకింగ్, వెల్ ఫెర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల నుంచి కంపెనీలకు సంబందించిన వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో ఎంపికైనా 325 నిరుద్యోగ యువతకు నియామాక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణహరి, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జూలూరి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమిది, మహేష్, తాటి ప్రసాద్, రాంశెట్టి హర్షిత, మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, శంకర్ రావ్, చాట్ల వంశీ, కాంగ్రెస్ నాయకులు పంపరి లక్ష్మణ్, జమిల్, రవీందర్ గౌడ్, రంగా రమేష్ గౌడ్, నర్సొళ్ల మహేష్, బల్ల శ్రీనివాస్, నిరంజన్, మెహర్ బాబా, గంగారాములు తదితరులు పాల్గొన్నారు.

 

Massive influx of unemployed youth

More articles

Latest article