భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత
. . . విజయవంతమైన జాబ్ మేళా కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శి రాముల కళ్యాణ మండపంలో జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జాబ్ మేళాకు కామారెడ్డి, భిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట్, పాల్వంచ, రామారెడ్డి మండలాలతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా యువత ఇంటర్యూకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరు కాగా, జాబ్...