24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

మాక్లూర్, బతుకమ్మ :

 

మాక్లూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుక సందర్బంగా మండల అధ్యక్షురాలు గంగోని మదారి మమత, మాక్లూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని బీజేపీ బంజారా నాయకుల ఆధ్వర్యంలో సేవాలాల్ మాల ధారణ వేసిన సేవాలాల్ మహారాజ్ భక్తులు భోగ్ బండర్ నిర్వహించారు.

 

MLA's birthday celebrated in grand style

 

సర్పంచ్ బడుగు సత్యనారాయణ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమలో మండల బిజెపి అధ్యక్షుడు గంగోని మమతా రాజేశ్వర్, మాజీ ఎంపిటిసి కోవూరు వడ్డెన్న, మాజీ వైస్ ఎంపీపీ అడెంధర్, బోంకన్ పల్లి గంగాధర్, గంగారెడ్డి, దేదావత్ రమేష్, నర్సింగరావు, నరేష్ గౌడ్, బబ్బిత్ గౌడ్, హరీష్, ప్రభాకర్, నేనావత్ వినోద్ నాయక్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

MLA's birthday celebrated in grand style

More articles

Latest article