25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిల్వ ఉందన్న గ్యాస్ ఏది .. ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్యాస్ కు కొరత లేదని చెబుతున్న ప్రభుత్వాలు

 

. . . గ్యాస్ కొరత పై తీవ్రంగా మండిపడుతున్న ప్రజలు

 

ఇందల్ వాయి, బతుకమ్మ

 

ఇందల్ వాయి మండల కేంద్రంలో ఇండేన్ గ్యాస్ కు ప్రజలు బుకింగ్ చేసుకున్నప్పటికీ గత వారం రోజుల నుండి గ్యాస్ అందకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండేన్ గ్యాస్ కు సంబంధించిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం తో తీవ్రత నెలకొంది. ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కు కొరత లేదని, గ్యాస్ నిల్వ ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మరో రెండు, మూడు రోజులు కొనసాగితే పరిస్థితి మరోలా ఉండబోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ను అందించాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో రోడ్ల పైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.

More articles

Latest article