30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళలు స్త్రీ నిధి రుణాలను వినియోగించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్త్రీ నిధి జిల్లా రీజనల్ మేనేజర్ రాందాస్

 

. . . స్త్రీ నిధి సురక్ష లోన్ బీమా నామినికి చెల్లింపు

 

వేల్పూర్, బతుకమ్మ :

 

మహిళలు స్త్రీనిధి రుణాలను వినియోగించుకొని జీవనోపాధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్త్రీ నిధి జిల్లా రీజనల్ మేనేజర్ రాందాస్ అన్నారు. స్త్రీ నిధి రుణం చెల్లిస్తున్న సభ్యురాలు మరణించడంతో ఆమె పేరు మీద ఉన్న రుణాన్ని ప్రభుత్వం చెల్లించడంతో సభ్యురాలు కట్టిన లోన్ డబ్బులను నామినికి అందజేయడానికి మేనేజర్ మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్పూర్ లోని శివదర్శని గ్రామ సంఘం పరిధిలోని మక్కా మదీనా సంఘ సభ్యురాలైన రిహానా బేగం కూరగాయల వ్యాపార నిమిత్తం 75 వేల రూపాయలు స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకుని రెగ్యూలర్ గా వాయిదాలు చెల్లించింది. ఈ క్రమంలో సభ్యురాలు మరణించడంతో ఆమె పేరు మీద ఉన్న లోన్ మాఫీ అయిందని, ఆమె కట్టిన లోన్ డబ్బులను ఆమె నామిని అయిన ఆమె కొడుకు కి రూ.39987 అందజేశామని ఆయన తెలిపారు. అలాగే మహిళా సంఘాల సభ్యులు స్త్రీ నిధి రుణాలు సక్రమంగా వినియోగించుకొని ప్రతి నెల వాయిదా ప్రకారం క్రమం తప్పకుండా చెల్లించాలని, ఈ చెల్లింపులకు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి వెన్న మురళి, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ లు రేణుక, సరస్వతి, గ్రామ సంఘం అధ్యక్షురాలు ఇందిరపు చాందిని, వివో ఏ లు అన్నపూర్ణ, లావణ్య, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article