రుద్రూర్, బతుకమ్మ :
బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం రుద్రూర్ గ్రామంలోని పెద్ద మజీద్ లో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిధిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొని ఒకరినొకరు పండ్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కర్కా అశోక్, ఉప సర్పంచ్ షేక్ నిస్సర్, అడప సాయిలు, పట్ల సురేష్, నరేష్, పార్వతి ప్రవీణ్, రాజు, సాయి లక్ష్మణ్, గొల్ల పవన్, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.