25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జీవన్ రెడ్డి దారెటు !

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీ అరవింద్ టచ్ లోకి జీవన్ రెడ్డి 

 

. . . బీజేపీలో చేరుతారని ఊహగానాలు 

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తదుపరి ఏ పార్టీలో చేరుతారనే అంశం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి , జీవన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో తీసుకునేలా చురుకుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం దృష్ట్యా జీవన్ రెడ్డి చేరికపై ముందడుగు వేయాలని ఆయన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులతో ఎంపీ అర్వింద్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డితో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించాలనే విషయాన్ని వారితో పంచుకున్నట్టు సమాచారం.రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కీలక నాయకులను ఆకర్షించే దిశగా బీజేపీ ప్రయత్నాలు కొనసాగుతు న్నాయని, జీవన్ రెడ్డి చేరిక అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Jeevan Reddy dare!

 

More articles

Latest article