26.6 C
Hyderabad
Monday, August 3, 2026

రేపు తెలంగాణ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్లేస్ మెంట్ డైరెక్టర్ సెల్ డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు మాట్లాడుతూ యువత తమ విద్యకు అనుగుణంగా మంచి ఉద్యోగాలను పొందేందుకు ఇటువంటి ఉద్యోగ మేళాలు ఉపయోగపడతాయని తెలిపారు. విశ్వవిద్యాలయం తరఫున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందన్నారు.

ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. పాత నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ రిస్యూమ్/బయో – డేటా, ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 గంటల నుండి క్యాంపస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, నిపుణ హ్యుమన్ డెవలప్ మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలను పొందాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆకాంక్షించారు.

More articles

Latest article