వెల్ నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌కు ఘన సన్మానం

0 9,008

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

వెల్ నెస్ హాస్పిటల్స్ నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ సూచనల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ మార్కెటింగ్ మేనేజర్ గాదె రవి కుమార్ సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, వెల్ నెస్ హాస్పిటల్స్ తరఫున మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్‌ను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ గఫర్, మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, గాదే తిరుపతి, సిద్ది శ్రీధర్ గుప్తా, తుమ్మల గాయత్రి శ్యామ్, అట్కారి చంద్రయ్యలను కూడా ఘనంగా సత్కరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని వెల్ నెస్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజారోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.