28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తొలి రోజు జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు

 

. . . మొదటి రోజు 51 మంది విద్యార్ధుల గైర్హాజరు

 

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు తెలుగు పరీక్షకు 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది విద్యార్థులు హాజరయ్యారు. 51 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష నిర్వహించారు. అందులో భాగంగా పర్యవేక్షణ అధికారులు 144 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. అందులో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ 52 సెంటర్లను, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ 9 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు అరగంట ముందే పరీక్షా కేంద్రంలోనికి అనుమతినిచ్చారు. మొదటి రోజు పరీక్షలకు ఎలాంటి అవాంతారాలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ గట్టి బందోబస్థు ఏర్పాటు చేయగా తొలి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదు.

More articles

Latest article