24.1 C
Hyderabad
Monday, August 3, 2026

సంగోజిపేట్ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్ శివారులో రాజన్న గుట్ట అటవీ ప్రాంతంలో చిరుత పులి కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు పులిని చంపి పులి గోర్లు దొంగిలించినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పులికి సంబంధించిన గోర్లు, పండ్లను గుర్తు తెలియని వారు దొంగిలించారని తెలుస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా అధికారిని నికిత, బాన్సువాడ ఫారెస్ట్ అధికారి హబీబ్, తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

More articles

Latest article