నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
ఖిల్లా ముదిరాజ్ సంఘం గాజులపేట్ బోయ గల్లి వారి ఆధ్వర్యంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముదిరాజ్ కి శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముదిరాజుల అభ్యున్నతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ మల్కాయ్ మహేందర్, మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, మఠం రేవతి లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ సుంకరి జయప్రకాష్, సెక్రటరీ సుంకరి సుమన్, ఉపాధ్యక్షులు సుంకరి సందీప్, క్యాషియర్ సుంకర ప్రదీప్, సుంకరి నరేష్, సుంకరి రాజశేఖర్, సుంకరి రాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
