28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మొదటిరోజు ప్రశాంతంగా పది పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పరీక్షలకు ఒకరు గైర్హాజరు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో మొదటిరోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. మొదటి రోజు శనివారం పరీక్షలకు మొత్తం 1222 మంది విద్యార్థులకు గాను 1221 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్టు ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ మండలంలోని బొర్లంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, బాన్సువాడ పట్టణంలో నాలుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా నిర్వహించడం జరిగిందన్నారు. బోర్లం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 246 మంది విద్యార్థులకు గాను 245 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్టు ఆయన తెలిపారు. మిగిలిన అన్ని పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article